janaprabha

janam kosam manam

పార్కుస్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి

మేడిపల్లి జనవరి 29, (జనప్రభ):

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 13 డివిజన్ లో దేవేందర్ నగర్ కాలనీ ఫేస్ టు డబుల్ బెడ్ రూమ్ దగ్గర 63 /1 సర్వే నెంబర్ లో ఎనిమిది వందల గజాల పార్కు స్థలం కొంతమంది కబ్జాదారులు కబ్జా చేస్తుండడం వలన స్థలాన్ని కాపాడలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా కాలనీవాసులు పార్కు స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. బోడుప్పల్ గ్రామపంచాయతీ ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం లో 2001లో దాదాపు 1150 పట్టాలను ఆనాటి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది. కొంతమంది కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేయడం జరుగుతుంది. అట్టి స్థలాన్ని కాలనీవాసులు కబ్జా గురికాకుండా కబ్జాదారుల నుండి కాపాడడం జరిగింది. ఎన్నోసార్లు రెవిన్యూ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం వలన కట్టడాలను కూల్చివేయడం జరిగింది. తేదీ 11 12 2020 నాడు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో అంశం నెంబర్ 2 ఇంజనీరింగ్ విభాగం సర్వే నంబర్ 22 ఎల్ ఆర్ ఎస్ ఎస్ ఫండు క్రింద నా వార్డు యందు ఎనిమిది వందల గజాల పార్కు స్థలానికి తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయమై గత 15 రోజుల కిందట ఎమ్మార్వో కి తెలియజేయడం వలన పట్టి నిర్మాణాన్ని కూల్చివేయడం జరిగింది. అప్పుడు అక్రమ నిర్మాణం ఇప్పుడు ఎలా సక్రమం అయిందని కాలనీవాసులు వాపోయారు. ఈ స్థలాన్ని కబ్జాదారులు కాపాడి మాకు తగు న్యాయం చేయాలని కలెక్టర్ కలిసి కాలనీవాసులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టి తగు న్యాయం చేస్తానని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు దాన గల్ల యాదగిరి, టిఆర్ఎస్ యువజన నాయకులుజెన్నె రాజు దేవేందర్ నగర్ కాలనీ ఫేస్టు వాసులు డివిజన్ అధ్యక్షులు వివిధ కాలనీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *