janaprabha

janam kosam manam

భార్యను వేదింపులకు గురిచేసిన మామిళ్ళ శ్రీనుపై బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

 

బోనగిరి జనవరి 12,యాదాద్రి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన మామిళ్ల జయమ్మ అనే మహిళ భర్త మామిళ్ల శ్రీనివాస్ గత మూడు సంవత్సరాలుగా చిత్రహింసలకు పాల్పడుతున్నాడని బేగంపేట్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన పోలీసులు మామిళ్ళ శ్రీనివాస్ పై భార్యపై వేదింపులు, అక్రమ సంబంధం కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ జోత్న్స తెలిపారు. అనంతరం జయమ్మ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తమ గోడును ఎవరు వినకపోవడం తో విసిగిపోయిన జయమ్మ తెలంగాణ ఎమ్మార్పీఎస్ ను సంప్రదించగా వారి చొరవతో కేసు నమోదు కావడంతో సంతోషకరమని ఆమె సంతోషం వ్యక్తం చేసిన అనంతరం తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజు మాట్లాడుతూ దళితుల పట్ల ఏ మహిళకు అన్యాయం జరిగిన మేము ముందుండి వారికి న్యాయం జరిగేంత వరకూ పోరాడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వి రమణ మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ మాదిగ రామంతపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రేణుక. యాదమ్మ. నాగమణి. ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *