janaprabha

janam kosam manam

కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభించిన టిఆర్ఎస్ నాయకులు పిల్లి సుందర్ 

అడ్డగూడూర్ జనవరి 25,
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలో కనుక దుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను టిఆర్ఎస్ నాయకులు పిల్లి సుందర రిబ్బన్ కట్ చేసి , హోటల్ ప్రారంభించారు . ఈ సందర్భంగా కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని కే. సైదులు మాట్లాడుతూ మా హోటల్ లో టీ, టిఫిన్, భోజనం, బిర్యాని, ఎగ్ రైస్ , ఎగ్ నూడిల్స్ , మంచూరియా వంటి అన్ని రకముల రుచికరమైన వంటలు లభించును. బిర్యాని కావలసిన వారు అర్థగంట ముందు ఆర్డర్ చేస్తే వెంటనే తయారు చేసి ఇవ్వగలము అని అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండంపేట సర్పంచ్ ఇటికాల కుమారస్వామి, గుండాల మండలం మాజీ ఎంపీపీ నత్తి లచ్చయ్య, వెల్దేవి గ్రామానికి చెందిన జలంధర్, మహేష్, బోడ వెంకన్న , రమేష్ , శేఖర్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *