అనాధ వృద్ధురాలిని అక్కున చేర్చుకున్న సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం

అనాధ వృద్ధురాలిని అక్కున చేర్చుకున్న సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం
అడ్డ గూడూరు ఫిబ్రవరి 3,(జనప్రభ):
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామానికి చెందిన ఈమెకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. భర్త వీరయ్య మధ్యలోనే అవ్వ మల్లమ్మ నూ వదిలి వేరే పెళ్లి చేసుకొని ఈ అవ్వ నువ్వు ఒంటరి చేసి వెళ్లాడు నా అనే వాళ్లు ఎవరు లేక ఒంటరి అయిన అవ్వ చేతనైనా రోజులు కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. వయస్సు పైబడటం తో పని చేయడం చేతకాక పోవడంతో బ్రతుకుతెరువు కోసం స్వగ్రామమైన కోటమర్తి లోనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అవ్వ పరిస్థితి చూసిన స్థానిక మాజీ వైస్ ఎంపీపీ పాశం విష్ణువర్ధన్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి లో గల “సహృదయ అనాధ వృద్ధాశ్రమ” నిర్వాహకులు యాకూబ్ చోటు సమాచారం ఇవ్వడంతో ఆ అవ్వ దీనస్థితిని తెలుసుకొని చలించిన ఆశ్రమ నిర్వాహకులు వెంటనే స్పందించి ఈరోజు తేదీ: – 03 – 02 – 2021 బుధవారం రోజున “సహృదయ అనాధ వృద్ధాశ్రమ” నిర్వాహకురాలు యాకూబ్ బి చోటు మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రావు ఆధ్వర్యంలో వృద్ధురాలిని రాయగిరి లోని సహృదయ అనాధ వృద్ధాశ్రమానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్ బి చోటు, ఆశ్రమ కోఆర్డినేటర్ నజీర్ మియా, మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రావు, పి ఏ సి ఎస్ డైరెక్టర్ వేముల బిక్షమయ్య, నీటి సంఘం చైర్మన్ గౌరిశెట్టి యాదగిరి, మాజీ వార్డు మెంబర్లు కుంభం మల్లయ్య, వార్డ్ నెంబర్ వేముల శోభ, గూడా సాయిబాబా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.