మహాఖనన దీక్షను అడ్డగూడూర్ మండల రైతులు విజయవంతం చేయాలని మనవి

అడ్డగూడూర్ జనవరి 24, స్థానిక మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు పార్టీలకు అతీతంగా జనవరి 26న రైతులు చేపట్టిన మహాఖనన దీక్షను విజయవంతం చేయాలని లక్ష్మీదేవికాల్వ గ్రామ ఉపసర్పంచ్ కన్నెబోయిన గంగరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనరులు తరలి పోతే వలసలు తప్పవని అన్నారు. ఇసుక క్వారీ అనుమతులు రద్దు కై వర్ధమానుకోట గ్రామ రైతులు బికేర్ వాగులో శాంతియుతంగా ర్యాలీ తీసి , గణతంత్ర దినోత్సవ జండా వందనం ఈ కార్యక్రమానికి రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వల్లంబట్ల రవీందర్ రావు , బండి విజయ్ , దామేర్ల పిచ్చయ్య , పాక సైదులు , శివ , చిరంజీవి , రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.