janaprabha

janam kosam manam

మేడ్చల్ జిల్లా రూరల్ ఎస్ టి మోర్చా అధ్యక్షులుగా రామచంద్రనాయక్

ఆకుల మల్లారెడ్డి లను ఘనంగా సన్మానించిన కోలన్ హనుమంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ జనవరి 29,(వార్తాప్రభ): మేడ్చల్ జిల్లా రూరల్ ఎస్ టి మోర్చా అధ్యక్షులుగా రామచంద్ర నాయక్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా బాచుపల్లిలోని బిజెపి కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బిజెపి సీనియర్ నాయకులు కోలన్ హనుమంత్ రెడ్డి రామచంద్రనాయక్ మరియు మేడ్చల్ జిల్లా రూరల్ అధికార ప్రతినిధిగా నియమితులైన ఆకుల మల్లారెడ్డిలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం తనవంతుగా కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు సహకరించిన హనుమంత్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి కి మరియు నిజాంపేట్ కార్పొరేషన్ బిజెపి సీనియర్ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *