janaprabha

janam kosam manam

మద్దూరు మండల తపస్ కార్యవర్గ కమిటీ ఎన్నిక

సిద్దిపేట జనవరి 9,(జనప్రభ): జిల్లా పరిధిలోని మద్దూరు మండల కేంద్రంలో లో జరిగిన తపస్ సర్వసభ్య సమావేశంలో మద్దూరు మండలం తపస్ కార్యవర్గ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. తపస్ జిల్లా అధ్యక్షులు బీరకాయల తిరుపతి సమక్షంలో లో మద్దూర్ మండలం తపస్ అధ్యక్షుడుగా శనిగరం రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా బైరగోని హరిప్రసాద్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా బూరుగు కనకయ్య మరియు జిల్లా కౌన్సిలర్ లుగా శివలింగం, మలిపెద్ది రామకృష్ణ, కొండ శ్రీనివాస్, కోశాధికారిగా నరిగే ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా గోరంతల లక్ష్మీనారాయణ, ఆవుల రజనీ దేవి, స్వర్గం కనక లింగం ,కర్ణకంటి రాజేశ్వరి ,మాచర్ల భాస్కర్, కార్యదర్శులుగా కత్తి శ్రీశైలం బూర మనోహర్ ,నారిజు చంద్రమౌళి, అరుణ్ కుమార్ ,సందింటి నిర్మల, కార్యవర్గ సభ్యులుగా చింతల హేమలత, మల్లం సుహాసిని, అశోక్, విష్ణు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపస్ గతంలో చేసిన అన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరిన్ని కొత్త కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ నెల 11 న నిర్వహించబోయే ధర్నా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్,నరిగే బాల భాస్కర్,కాళీ రవి, సిద్ధారెడ్డి, లింగా చారి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *